PushpaTheRise | టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వచ్చిన చిత్రం పుష్ప.. ది రైజ్ (Pushpa..The Rise). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టింది. అల్లు అర్జున్ను ఐకాన్ స్టార్ గా మార్చేసింది. ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించారు మేకర్స్. పుష్ప.. ది రైజ్‌తో ఖండతరాల్లో తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు పుష్పరాజ్. పుష్ప.. ది రైజ్ రష్యాలో డిసెంబర్ 8న విడుదల కానుంది.
డిసెంబర్ 1న మాస్కో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్ బర్గ్‌లో గ్రాండ్ ప్రీమియర్స్ ఉండబోతున్నాయని స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేసింది టీం. రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ రేపు ఉదయం 11:07 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు తెలియజేశారు మేకర్స్. సుకుమార్, బన్నీ మరోసారి పుష్ప ..ది రూల్ (Pushpa 2) తో డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్దమవుతున్నారు.
పుష్ప 2 అప్డేట్స్ కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. ఫస్ట్ పార్టును మించి సీక్వెల్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నాడు సుకుమార్. పుష్ప 2లో కూడా కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ రోల్లో మెరవబోతుంది. సీక్వెల్లో కనిపించబోయే కొత్త యాక్టర్లెవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
పుష్పరాజ్ స్టన్నింగ్ అప్డేట్ లుక్..
Meet team #PushpaTheRise at the Russian language premieres💥
Dec 1st – Moscow
Dec 3rd – St. Petersburg#PushpaTheRise releasing in Russia in Russian Language on Dec 8th 🔥#PushpaInRussiaIcon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @4SeasonsCreati1 pic.twitter.com/lyouNRRemj
— Mythri Movie Makers (@MythriOfficial) November 28, 2022
పుష్ప.. ది రైజ్ ట్రైలర్ అప్డేట్..
#PushpaTheRise Russian language trailer tomorrow at 11.07 AM 💥
Special premieres on Dec 1st at Moscow & Dec 3rd at St. Petersburg 🔥#PushpaInRussia
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @4SeasonsCreati1 pic.twitter.com/g8w20fnrRu
— Mythri Movie Makers (@MythriOfficial) November 28, 2022