Sikandar | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్న ‘సికందర్’ (Sikandar). సల్లూభాయ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
కాగా డిసెంబర్ 27న అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ రాబోతున్నట్టు ఇప్పటికే వార్తలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. కాగా టీజర్లో సల్మాన్ ఖాన్ మాస్క్ అవతార్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. సల్లూ భాయ్ మాస్క్ వేసుకొన్న మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి హైపర్ స్టైలిష్‌గా కనిపించబోతుండగా.. అభిమానులకు విజువల్ ఫీస్ట్ ఇచ్చేలా టీజర్‌ను కట్ చేసినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. ఇదే నిజమైతే బాక్సాఫీస్ అంచనాలు తలక్రిందులవడం ఖాయమైనట్టేనని చెప్పొచ్చు.
సికిందర్లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తుండగా.. సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని సమాచారం.
KTR | మొగులన్నా.. నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటింది: కేటీఆర్
Keerthy Suresh | తగ్గేదే లే.. బేబిజాన్ ప్రమోషన్స్‌లో మంగళసూత్రంతో కీర్తిసురేశ్