డీజే టిల్లు సినిమాతో బాక్సాపీస్‌ను షేక్ చేశాడు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda). ఈ బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్‌కు సీక్వెల్ గా వస్తున్న సినిమాకు టైటిల్ ఫైనల్ చేశారు మేకర్స్. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రానికి టిల్లు 2 (Tillu 2) టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇవాళ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. టిల్లు 2 టైటిల్ లుక్ పోస్టర్‌ను లాంఛ్ చేశారు. మా స్టార్ బాయ్ సిద్దునూ కలవండి.. రెట్టింపు వినోదం, డబుల్ రొమాన్స్, డబుల్ మ్యాడ్ నెస్ తో టిల్లు ఈజ్ బ్యాక్ అంటూ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్.
టిల్లు 2 చిత్రానికి నరుడా డోనరుడా, అద్బుతమ్ ఫేం మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలోకార్తికేయ 2తో సూపర్ హిట్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించబోతుంది. కామెడీ థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న సీక్వెల్లో అనుపమ, సిద్దు రొమాంటిక్ సన్నివేశాలు మూవీ లవర్స్‌ను ఫిదా చేసేలా ఉండబోతున్నాయని ఇన్ సైడ్ టాక్.
టిల్లు 2 చిత్రాన్నిశ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.షూటింగ్ మొదలైంది.. 2023 మార్చిలో థియేటర్లలో సందడి చేయనుందని మేకర్స్ విడుదలపై క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్ చిత్రానికి కూడా సిద్ధూ కథను అందించడం విశేషం.
టిల్లు 2 ఫన్ ట్రాక్ వీడియో..
Read Also : Vaarasudu | దీపావళి విషెస్‌తో విజయ్ అభిమానులకు శుభవార్త.. వారసుడు విడుదల తేదీ ఫైనల్
Read Also : Sir | ధనుష్ టీం దీపావళి శుభాకాంక్షలు.. సార్ కొత్త పోస్టర్
Read Also : Balakrishna | మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ.. వివరాలివే