సిద్ధు జొన్నలగడ్డ, కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ప్రముఖ ైస్టెలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ప్రతిష్టాత్మక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మల్లిక గంధా..’ చార్ట్ బస్టర్‌గా నిలిచిందని మేకర్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలోని రెండోపాటను మంగళవారం విడుదల చేశారు. అగ్ర కథానాయిక నయనతార ఈ పాటను లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
‘సొగసు చూడ తరమా..’ అంటూ సాగే ఈ పాటను కృష్ణకాంత్ రాయగా, తమన్ స్వరపరిచారు. కార్తీక్ ఆలపించారు. సమయం సాయంత్రమవ్వడంతో సిద్ధూ బయలుదేరుతుండగా, శ్రీనిధి తన వాచ్‌ని రీసెట్ చేసి, తానింకా వీడ్కోలుకు సిద్ధంగా లేనని చూపించే ప్రయత్నంలో ఈ పాట వచ్చింది. ఈ పాటలో సిద్ధు, శ్రీనిధిల కెమిస్ట్రీ అదిరిపోతుందని, ైస్టెలిష్ డాన్స్‌తో ఇద్దరూ ఆకట్టుకుంటారని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్ వి.ఎస్.