సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం గురువారం హైదారాబాద్‌లో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సంస్థకిది 37వ సినిమా. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, దిల్ రాజు కెమెరా స్విఛాన్ చేశారు.
నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘విభిన్నమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే అన్ని అంశాలుంటాయి. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల, సమర్పణ: బాపినీడు.బి, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్.