Siddhu Jonnalagadda | టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda) ఈ ఏడాది టిల్లు 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడని తెలిసిందే. ప్రస్తుతం పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraja Kona) డైరెక్షన్లో తెలుసు కదా (Telusu Kada) సినిమాలో నటిస్తున్నాడు.. ఈ మూవీలో రాశీఖన్నా (Raashi Khanna) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా డీజే టిల్లు యాక్టర్ కొత్త సినిమా షూట్లో జాయిన్ అయ్యేదెప్పుడో ఎదురుచూస్తున్న సినీ జనాల కోసం ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. తెలుసు కదా చిత్రీకరణ మొదలైంది.
మొదటి రోజు షూట్లో సిద్దు, రాశీఖన్నా జాయిన్ అయ్యారు. 30 రోజులపాటు సాగనున్న ఈ షెడ్యూల్లో టాకీ సీక్వెన్స్‌తోపాటు సాంగ్స్‌ను షూట్ చేయబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లీడింగ్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్నాడు.నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నాడు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాశ్ కొల్లా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శీతల్ శర్మ పనిచేస్తున్నారు.
PMF30గా వస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. స్టైలిష్ట్‌గా పాపులర్ అయిన నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా అదృష్టాన్ని పరీక్షించుకోనుండటంతో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిద్దు జొన్నల గడ్డ మరోవైపు టిల్లు ప్రాంఛైజీలో టిల్లు 3 కూడా చేయబోతున్నాడని తెలిసిందే. దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
NTR Neel | హమ్మయ్య.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ డేట్ ఫైనల్..!