3 BHK Trailer | తమిళ నటుడు సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 3 BHK. ఈ సినిమాకు శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తుండగా.. శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు, మీఠా రఘునాథ్, చైత్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 4న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుండగా.. అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక మధ్యతరగతి కుటుంబం సొంత ఇల్లు కొనడానికి పడే పాట్లను, వారి కలలను ఆవిష్కరించే భావోద్వేగభరితమైన కుటుంబ డ్రామాగా రాబోతుందని తెలుస్తుంది. ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Read More