ఉప్పల్ జూన్ 26 : సిమెంటు రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి అని కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ అన్నారు. నాచారంలోని ఇందిరానగర్ లో 25 లక్షల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మిస్తున్న సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ గురువారం పరిశీలించారు. చాలా కాలం వేచి ఉన్న తర్వాత వీధుల్లో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేసి, రోడ్లు కూడా వేయిస్తున్నందుకు స్థానిక బస్తీ వాసులు కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇందిరానగర్ లోని అన్ని వీధులు దాదాపుగా భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తిచేసి సిమెంట్ రోడ్లు కూడా వేయించడం జరిగిందన్నారు. ఇంద్రానగర్ మొదటి లెఫ్ట్ వీధి అలాగే ఇందిరానగర్ స్టార్టింగ్ లో పాడైన రోడ్డు స్థానంలో కూడా కొత్త సిమెంటు రోడ్లు తొందర్లోనే వేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిజెన్ శేకర్, విఠల్ యాదవ్, కట్ట బుచ్చన్న గౌడ్, చంద్రశేఖర్, ఆమీర్, జాకీర్, జానీ, అహ్మద్, వర్క్ ఇన్స్పెక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.