Panchayat Raj | హైదరాబాద్ : పంచాయతీరాజ్ క్వాలిటీ విభాగంలో చీఫ్ ఇంజినీరింగ్‌గా కొనసాగుతున్న వై రామకృష్ణపై వచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని, ఆయనపై ప్రాథమిక దర్యాప్తు జరిపి వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్.. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా సంబంధిత ఇంజినీర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఆరోపణలు ఎదుర్కొంటున్న రామకృష్ణ స్థానంలో తాత్కాలికంగా మరొక ఇంజనీర్‌ను నియమించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.