ఒక్కో పాటకు సిద్ శ్రీరామ్ రెమ్యునరేషన్ తెలిస్తే ఖంగు తింటారు..!

ఎక్కడో అమెరికా నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ సింగర్ అయిపోయాడు సిద్ శ్రీరామ్. తమ సినిమాల్లో కనీసం ఒక్క పాటైనా ఈ గాయకుడితో పాడించాలని సంగీత దర్శకులు కూడా పట్టు పడుతున్నారు. నిర్మాతలు కూడా ఈయన పాట చూపించి బిజినెస్ పూర్తి చేస్తున్నారు. తెలుగులో అంత క్రేజ్ సంపాదించుకున్న సింగర్ మరొకరు లేరు. ఒకప్పుడు ఎస్పీ బాలు, యేసుదాస్ లాంటి లెజెండరీ సింగర్స్ విషయంలో మాత్రమే సంగీత దర్శకులు పట్టు పట్టేవాళ్లు. వాళ్లతో పాటలు పాడించడానికి కష్టపడేవాళ్లు. అలాగే ఇప్పుడు సిద్ శ్రీరామ్ విషయంలో ఇదే జరుగుతుంది. ఈయన పాడితే ఆ పాటే సినిమాకు ప్రాణం అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సిద్ పాట పాడితే అదే బిజినెస్ మంత్రం. ముందుగా ఒక్క పాటను విడుదల చేసి బిజినెస్ పూర్తి చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
యాంకర్ ప్రదీప్ హీరోగా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నీలినీలి ఆకాశం.. శశి సినిమాలో ఒకేఒక లోకం నువ్వు.. వకీల్ సాబ్ సినిమాలో మగువ మగువ.. అల వైకుంఠపురంలో సామజవరగమనా ఇలా ఈయన ఏ పాట పాడినా కూడా సంచలనం అనే మాట తప్ప మరోటి లేదు. గీత గోవిందంలో ఇంకేం కావాలి పాట ఇప్పటికీ వింటుంటారు అభిమానులు. సిద్ గళం నుంచి ఏ పాట వచ్చినా కూడా సూపర్ హిట్టే. దానికి మరో మాటే లేదు. అంత క్రేజ్ ఉంది కాబట్టే ఈయన కోసం సంగీత దర్శకులు కూడా ఎగబడుతున్నారు. అయితే మనోడి పాటలో క్లారిటీ ఉండదు.. పదాలు స్పష్టంగా పలకడు అనే విమర్శలు ఉన్నా కూడా సిద్ మాత్రం దూసుకుపోతున్నాడు.
ఈయన ఒక్కో పాట కోసం ఎంత తీసుకుంటాడు అనేది మాత్రం చాలా మందికి కనీసం ఐడియా లేదు. ఈ రోజుల్లో సింగర్స్‌కు ఒక్క పాట పాడితే మహా అయితే 20 వేలు ఇస్తుంటారు.. స్టార్ సింగర్ అయితే 50 వేలు.. మరీ గొప్ప సింగర్ అయితే లక్ష అంతే. కానీ సిద్ ఎంత తీసుకుంటాడో తెలుసా..? అక్షరాలా 4.5 లక్షలు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఆయన రేట్ ఇంతే అని తెలుస్తుంది. కొన్ని రోజుల కింది వరకు 4 లక్షల వరకు తీసుకున్నా కూడా ఇప్పుడు మరో 50 వేలు పెంచేసాడని ప్రచారం జరుగుతుంది. మిగిలిన వాళ్లు లక్ష కోసం యుద్ధాలు చేస్తుంటే.. సిద్ శ్రీరామ్ మాత్రం నాలుగు రెట్లు ఎక్కువ తీసుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి:
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
స్టీల్ ప్లాంట్ల నుంచి 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాలు!
ఆక్సిజన్ కు కటకట : అలాగైతే 24 గంటల్లో వ్యవస్థ కుప్పకూలుతుంది..
ఆక్సిజన్ కొరత.. ఆ దవాఖానలో కొత్త రోగులకు నో అడ్మిషన్
మళ్లీ గరీబ్ కల్యాణ్ యోజన: రెండు నెలలు పేదవాడికి 5 కిలోల బియ్యం ఫ్రీ
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెంటింగ్ : నిందితుడు అరెస్ట్
మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. మైండ్ బ్లాక్ చేసిన సూపర్ స్టార్
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
అత్యంత ఖరీదైన, అతిపెద్ద స్మార్ట్‌టీవీని ఆవిష్కరించిన షియోమీ
భారత్ భయంకరమైన స్థితిలో ఉన్నది: ఆంథోనీ ఫౌసీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- remuneration
- sid sriram
- singer
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

