హైదరాబాద్: ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఈ మొక్కలు నాటే యజ్ఞంలో పాల్గొంటున్నారు. తాజాగా హీరో నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్ర బృందం ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నది. జూబ్లీహిల్స్‌లోని ప్రసాసన్ నగర్లో ఉన్న జీహెచ్ఎంసీ పార్కులో హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతిశెట్టి, నిర్మాత బోయినపల్లి వెంకట్ మొక్కలు నాటారు. అనంతరం హీరో నాని మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఎంపీ సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళుతున్నారని చెప్పారు. ఇది ప్రజల్లో ఎంతో అవగాహన కల్పిస్తున్నదన్నారు. మొక్కలు నాటడం సంతోషంగా ఉందని చెప్పారు. గ్లోబల్ వార్మిగ్ని అరికట్టడానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ దోహదపడుతుందని, భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు.