Shraddha Kapoor | బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నది. ఇటీవల ఆమె నటించిన స్త్రీ-2 విజయవంతంగా 50 రోజుల థియేట్రికల్ రన్ని పూర్తి చేసుకున్నది. ఈ క్రమంలో షిర్డీ సాయిబాబా ఆశీర్వాదం తీసుకున్నది. ఈ సందర్భంగా సాయిబా ఆలయాన్ని సందర్శించిన ఫొటోలను సోషల్ మీడియాలో శ్రద్ధ షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన బాలీవుడ్ నటిని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు సన్మానించారు. 2018లో వచ్చిన బ్లాక్ బాస్టర్ హారర్ కామెడీ స్త్రీ మూవీకి సీక్వెల్గా తెరకెక్కించారు.
గత ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్గా నలిచింది. ప్రస్తుతం ఈ మూవీ రూ.600కోట్ల క్లబ్లో చేరబోఉన్నది. మూవీ విడుదలై 50 రోజులవుతున్నా మూవీని చూసేందుకు థియేటర్లకు అభిమానులు క్యూ కడుతున్నారు. హారర్ కామెడి మూవీ షారుఖ్ ఖాన్ ‘జవాన్’ కలెక్షన్స్ని అధిగమించి.. ఆల్టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలిచింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగానూ స్త్రీ-2 నిలిచింది. ఈ మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ అతిథి పాత్రల్లో మెరిశారు.