Shivaji | కోర్ట్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి సినిమాకే హైలెట్‌గా నిలిచాడు సీనియర్ యాక్టర్ శివాజీ. ఈ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన శివాజీ మరో పవర్ ఫుల్ రోల్లో కనిపించబోతున్నాడు. యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం ప్రేమకు నమస్కారం. వి భీమ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఉల్కగుప్తా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది.
ఈ మూవీలో శివాజీ మహాదేవనాయుడుగా చాలా పవర్ ఫుల్ రోల్లో కనిపించనున్నాడు. మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ మహాదేవనాయుడు ఇంట్రో వీడియోను షేర్ చేశారు. ఈ మూవీలో భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏబీ సినిమాస్ పతాకంపై అనిల్ కుమార్ రావాడ, భార్గవ్ మన్నె నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇదొక యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ అని.. యూత్‌తోపాటు అందరికి కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయన్నారు. ముఖ్యంగా నేటి యువత లవ్, బ్రేకప్అప్, ఇలా అన్ని అంశాలను పూర్తి వినోదభరితంగా ఈ చిత్రంలో చూపించబోతున్నాం. నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈ చిత్రంలో నటుడు హీరో శివాజీ పాత్రలో ఎంతో కీలకంగా ఉంటుంది. సినిమా ఆద్యంతం కనిపించే పాత్ర ఇది. ఆయన పాత్రలో కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. కోర్టు సినిమాలో ఆయనకు ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో అంతకు మించిన పేరు వస్తుంది. ఆయన పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది. మహాదేవ నాయుడుగా ఆయన నట విశ్వరూపం చూస్తారన్నారు.
నిర్మాత మాట్లాడుతూ.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న చిత్రమిది. కొత్తదనం, హిలేరియస్ ఎంటర్టైనర్మెంట్ ఈ చిత్రంలోని ప్రత్యేకతలు. శివాజీ పాత్ర ఆయన కెరీర్లో గుర్తుండిపోయేలా ఉంటుంది. మహాదేవ నాయుడు పాత్ర అందరికి నచ్చే విధంగా ఉంటుంది. అన్నారు. ఈ మూవీలో బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అరుణ్ అదిత్, రంగస్థలం మహేష్, మణిచందన, కమల్, క్రాంతి, నీల రమణ, శోభన్, సుభాష్, కోటేశ్వరరావు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
మహాదేవ నాయుడు ఇంట్రో వీడియో..
Dhanush | ధనుష్ అదిరిపోయే ప్లాన్.. అప్పుడే మరో సినిమా రిలీజ్..!
Rahul Ramakrishna | ట్విట్టర్ యాక్టివిజంకు గుడ్‌బై.. వైరలవుతున్న రాహుల్ రామకృష్ణ ఎక్స్ పోస్ట్