Shilpa Shetty : యోగా, ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే బాలీవుడ్ నటి శిల్పా శెట్టి వాస్తవానికి ఫుడ్ లవర్. ఆమె ఇన్స్టాగ్రాం టైంలైన్ చూసినా ఈ విషయం వెల్లడవుతోంది. ఇక లేటెస్ట్గా ఓ షూటింగ్ స్పాట్లో లంచ్ సీన్‌కు సంబంధించిన వీడియో శిల్పా శెట్టి ఎంతటి భోజన ప్రియురాలో తేటతెల్లం చేసింది.
45 నిమిషాల్లో లంచ్ సిద్ధం అని తెలియగానే, శిల్పా నాకు బోండా, వడ ఉండాలి.. నా దగ్గర రవ్వ దోసె ఉండాలి. నాకు సాంబారు కావాలి. నా దగ్గర పెరుగు అన్నం ఉండాలి, కరకరలాడే ఇడ్లీ ఉండాలి, ఇంకా పనియారం కూడా ఉండాలంటూ తనకు కావాల్సిన డిష్‌ల చిట్టా బయటపెట్టడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇక అక్కడితో ఆగని శిల్పా కుల్ఫీ ఉంటే తనకు అది కావాలని, పాన్ గురించి గుర్తుచేస్తూ పాన్ తప్పనిసరని చెబుతుంది. ఆపై ఎవరో వీడియో రికార్డు చేస్తున్నారని తెలిసి ఆమె బిగ్గరగా నవ్వుతుంది.
ఇక శిల్పా పక్కనే నిలుచున్న యువతి ఓ లంచ్ అయిన తర్వాత ఇది..ఇప్పటికే ఒకసారి లంచ్, రెండుసార్లు బ్రేక్‌ఫాస్ట్ అయిందని చెబుతుంది. ఇక కొద్దినిమిషాల తర్వాత శిల్ప ముందు ఆమె ఆర్డర్ చేసిన డిష్‌లు కొద్దిగా తినిఉండటం కనిపిస్తుంది. ఇక చివరిగా కుల్ఫీని ఎంజాయ్ చేసిన నటి ఆపై పాన్ టేస్ట్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.
Read More :
Divi Vadthya | చీరకట్టులో తడిసిన అందాలతో.. దివి వైద్య సొగసు చూడతరమా