Kuberaa Collections | విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కుబేర. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్రం విడుదలైన తొలిరోజే తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఏకంగా రూ.13 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మొదటి రోజు థియేటర్లు 57.36 శాతం ఆక్యుపెన్సీతో నిండిపోయినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. అయితే ఈ కలెక్షన్లు వీకెండ్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు తొలిరోజు వసూళ్లను బట్టి చూస్తే, ఇది ధనుష్ కెరీర్లో రెండో బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ కావడం విశేషం. అంతకుముందు ధనుష్ నటించిన రాయన్ చిత్రం తొలిరోజే రూ.15 కోట్ల వసూళ్లను రాబట్టింది.
Read More