Shatamanam Bhavati | సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ కొన్ని సినిమాలు మూవీ లవర్స్ మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంటాయి. అలాంటి సినిమాల జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది శతమానం భవతి (Shatamanam Bhavati). సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో విలేజ్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శర్వానంద్ (Sharwanand), అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో ప్రకాశ్‌రాజ్, జయసుధ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఒక నేషనల్ అవార్డ్‌తోపాటు ఆరు నంది అవార్డులు వచ్చాయి.
ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా ఏడేండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇప్పుడీ హిట్ సినిమాకు సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది. మూవీ లవర్స్ కోసం శతమానం భవతి నెక్ట్స్ పేజి లోడింగ్.. వచ్చే సంక్రాంతికి కలుద్దాం.. అంటూ దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ఇప్పుడీ వార్తతో వచ్చే సంక్రాంతికి రెట్టింపు సంబురాలు ఉండబోతున్నట్టు మేకర్స్ చెప్పకనే చెబుతున్నారని అర్థమవుతోంది. సీక్వెల్లో ఎవరెవరు నటించబోతున్నారు.. ఇతర వివరాలేంటనే దానిపై రాబోయే రోజుల్లో అప్డేట్ అందించనున్నారు మేకర్స్.
సీక్వెల్ అప్డేట్..
7 years ago, #ShathamanamBhavathi Celebrated Sankranthi with its timeless magic ❤️
Now, get ready for another chapter unfolding with even more enchantment in 2025! 😍
More Details loading soon 😉
వచ్చే సంక్రాంతికి కలుద్దాం ❤️🔥 pic.twitter.com/yJT5xump4Q
— Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2024