42శాతం రిజర్వేషన్లతోనే పరిషత్ ఎన్నికలకు వెళ్లాలి
కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగానే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ బీసీల నోట్లో మట్టికొడుతున్నదని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
- బీసీ వాదం నిర్మూలనకు రేవంత్ కుట్రలు
- లేదంటే కాంగ్రెస్ పార్టీపై యుద్ధం చేస్తాం
- కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఆర్ కృష్ణయ్య ఫైర్
రవీంద్రభారతి, డిసెంబర్14: కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగానే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ బీసీల నోట్లో మట్టికొడుతున్నదని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు 42శాతానికి పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై బీసీ సమాజం పోరాడటం ఖాయమని హెచ్చరించారు.
ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ దేశోద్ధారకభవన్‌లో బీసీ సంఘాల నేతలతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పిన కాంగ్రెస్.. గెద్దెనెక్కిన తర్వాత నయవంచన చేసిందని ధ్వజమెత్తారు. బీసీలను మోసం చేయడానికి రేవంత్‌రెడ్డి చేస్తున్న కుట్రలను తిప్పికొడుతామని చెప్పారు. బీసీవాదాన్ని పట్టించుకోకుండా గ్లోబల్ సమ్మిట్, ఫుట్‌బాల్ ఆటలతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నేతలు రామ్దేవ్మోదీ, నీల వెంకటేశ్, బీసీ కుల సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

