ఆర్టీసీలో డ్రైవర్‌తోనే కండక్టర్ డ్యూటీలు
టీజీఎస్ఆర్టీసీని కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. అందుకు నిదర్శనం డ్రైవర్లకు కండక్టర్ల బాధ్యతలు అప్పగించడమే. అధిక పనిభారంతో సతమతమవుతుండగా, దూరపు ప్రయాణాలకు కూడా కండక్టర్ డ్యూటీ చేయాల్సి వస్తున్నదని డ్రైవర్లు వాపోతున్నారు.
- మూడు వేలకు పైగా కండక్టర్ పోస్టులు ఖాళీ
- ఔట్‌సోర్సింగ్‌తో సర్దుబాటుకు సంస్థ ప్రయత్నాలు
- రిటైర్మెంట్లకు తగ్గట్టు ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘాలు
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : టీజీఎస్ఆర్టీసీని కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. అందుకు నిదర్శనం డ్రైవర్లకు కండక్టర్ల బాధ్యతలు అప్పగించడమే. అధిక పనిభారంతో సతమతమవుతుండగా, దూరపు ప్రయాణాలకు కూడా కండక్టర్ డ్యూటీ చేయాల్సి వస్తున్నదని డ్రైవర్లు వాపోతున్నారు. ఒకచేతిలో స్టీరింగ్, మరో చేతితో టికెట్ ఇష్యూ మిషన్‌తో తలకు మించిన భారం గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఎక్స్‌ప్రెస్‌లలో డ్యూటీ వేసేటప్పుడు కండక్టర్ అందుబాటులో లేక బలవంతంగా టిమ్ చేతికి ఇస్తున్నారన్నారు.
వినతి పట్టించుకోని ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అయినా ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2,100 మంది కండక్టర్ల కొరత ఉండగా, మార్చిలో భారీ గా రిటైర్మెంట్లు ఉన్నాయి. గతంలో కొనుగోలు చేసిన 380 బస్సులకూ కండక్టర్లు లేరు. దీంతో తక్షణమే 1,000 కండక్టర్ పోస్టులు అవసరమని ఉన్నతాధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు మొత్తం 3వేలకుపైగా కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఆర్టీసీని మొత్తం ఎలక్ట్రిక్ బస్సులతో నింపాలని ప్రభుత్వం చూస్తున్నదని, అందుకే నియామకాలు చేపట్ట డం లేదని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
ఔట్‌సోర్సింగ్‌లో నియామకాలు..
డబుల్ డ్యూటీలు చేయలేమని డ్రైవర్లు మొరపెట్టుకుంటుండటంతో ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌లో నియామకాలు చేపట్టింది. దీంతో రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన పోస్టులను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వ డం ఏంటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం కార్మికులను నమ్మిం చి గొంతు కోస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఆర్టీసీ బతకాలంటే విరమణలకు తగ్గట్టుగా నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Conductors
- drivers
- Telangana
- TGSRTC
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

