రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో రూపేష్, ఆకాంక్షసింగ్ జంటగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ప్రభ దర్శకుడు. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతాన్నందిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమాలోని రెండో గీతాన్ని హీరో రవితేజ విడుదల చేశారు. ‘ఇరు కనులు కలిసి మురిసె, మొదటి చూపులో, తొలి పిలుపు తగిలి మెరుపు మెరిసే మనసు నింగిలో..’ అంటూ మనసును ఆకట్టుకునే భావాలతో ఈ పాట సాగింది.
ఇళయరాజా బాణీకి గీత రచయిత రెహమాన్ సాహిత్యాన్నందించారు. ఎస్పీ చరణ్, విభావరి ఆలపించారు. కథానుగుణంగా వచ్చే చక్కటి యుగళగీతమిదని, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని సుందర లొకేషన్లలో చిత్రీకరించామని, తోట తరణి కళా దర్శకత్వం ఈ పాటకు కొత్తందాన్ని తీసుకొచ్చిందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: రూపేష్, స్క్రీన్ప్లే, సంభాషణలు, దర్శకత్వం: పవన్చంద్ర.