తెలుగు చిత్రసీమలో సరికొత్త కాంబినేషన్ సెట్ అయింది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ రూపొందించడంలో పేరు పొందిన దర్శకుడు సంపత్‌నంది, వెర్సటైల్ హీరో శర్వానంద్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
గురువారం ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడింది. ‘యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథాంశమిది. 1960 దశకంలో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామీణ ప్రాంతంలో కథ నడుస్తుంది. శర్వానంద్ పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో సరికొత్త పంథాలో ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: సంపత్‌నంది.