Sharwa 37 | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి Sharwa 37. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఈ మూవీలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే సంయుక్తా మీనన్ ఫస్ట్ లుక్ షేర్ చేయగా.. దియా పాత్రలో నటిస్తోన్న ఈ భామ సంప్రదాయ నృత్య భంగిమలో ఉన్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా షూటింగ్ అప్డేట్ అందించింది శర్వా టీం. ఈ సినిమా కొత్త షెడ్యూల్ Gods own country కేరళలో పూర్తయింది. అందమైన లొకేషన్లలో 10 రోజుల షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయినట్టు తెలియజేస్తూ శర్వానంద్ టీం ఫొటో దిగింది. ఈ స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
అద్భుతమైన ఫన్ రైడ్‌తో ప్రేమ, నవ్వుల కలయికను ఇదివరకెప్పుడూ లేని విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి.. అంటూ ఏకే ఎంటర్టైన్మెంట్స్ షేర్ చేసిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రంలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు.
శర్వానంద్ దీంతోపాటు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో Sharwa 36లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది.. అంటూ లాంచ్ చేసిన ప్రీ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
KERALA SCHEDULE WRAPPED 🌴❤️🔥
Team #Sharwa37 completed an amazing 10-day schedule in the beautiful locales of God’s own country 😍❤️@ImSharwanand #Sharwanand pic.twitter.com/u3eGzqUNl0
— BA Raju’s Team (@baraju_SuperHit) September 25, 2024
Prakash Raj | చేయని తప్పుకి సారీ.. హాట్ టాపిక్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి