శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్’. ఇండియాలో ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ సినిమా ఇది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 6న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేశారు. గురువారం ‘ప్రెట్టీ బేబీ’ అనే వీడియోసాంగ్‌ను విడుదల చేశారు. అదిరిపోయే బీట్తో డ్యాన్స్ నెంబర్‌గా జిబ్రాన్ ఈ పాటను కంపోజ్ చేశారు.
కృష్ణకాంత్ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ఈ పాటలో శర్వానంద్-మాళవిక నాయర్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.1990-2000 బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే బైకర్‌గా శర్వానంద్ కనిపిస్తారని, మూడుతరాల రేసింగ్ కలకు అద్దంపట్టే చిత్రమిదని, గెలవడం కాదు..చివరిదాక పోరాడటమే గొప్ప అనే సందేశంతో ఈ సినిమా మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు.