‘ఈ సినిమాలో ఒక్క సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) షాట్ ఉండదు. అన్నీ ఒరిజినల్ బైకర్స్‌తో తీసినవే. ఈ సినిమా విషయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఒక గొప్ప సినిమా చేశానని గర్వంగా చెబుతున్నా’ అని అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘బైకర్’. ఇండియాలో ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ సినిమా ఇది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
డిసెంబర్ 6న విడుదలకానుంది. శనివారం ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘ఇక్కడ ప్రతి బైకర్‌కు ఓ కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకి ఎదురెళ్లే కథ. ఏం జరిగినా పట్టువదలని మొండివాళ్ల కథ’ అనే సంభాషణతో మొదలైన గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక్కడ గెలవడం కాదు. చివరిదాక పోరాటం గొప్ప అనే స్పిరిట్‌ను గ్లింప్స్‌లో ఆవిష్కరించారు.
ఈ సినిమా తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవుతుందని, రాజశేఖర్‌తో కలిసి నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని శర్వానంద్ చెప్పారు. అద్భుతమైన సబ్జెక్ట్ ఇదని, ఈ సినిమా విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నానని రాజశేఖర్ పేర్కొన్నారు. ఇండియన్ స్క్రీన్ మీద తొలి రేసింగ్ సినిమా ఇదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని దర్శకుడు అభిలాష్ రెడ్డి తెలిపారు.