Biker Glimpse | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి Sharwa 36. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి బైకర్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ.. ఇటీవలే టైటిల్ లుక్ కూడా విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మేకర్స్ బైకర్ గ్లింప్స్ షేర్ చేశారు.
ఇక్కడ ప్రతీ బైకర్‌కు ఓ కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ.. చావుకు ఎదురెళ్లే కథ.. అంటూ సాగే వాయిస్‌తో ఓవర్‌తో మొదలైన గ్లింప్స్ బైక్ రేసుతో సాగుతుంది. ఏం జరిగినా పట్టువదలని మొండోళ్ల కథ అంటూ కట్ చేసిన గ్లింప్స్ బైక్ రేసింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తుంది.
మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది.. గూస్బంప్స్ తెప్పించే అడ్వెంచరస్ రైడ్‌కు సిద్దంగా ఉండండి.. అంటూ శర్వానంద్ టీం ఇప్పటికే బైకర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ మరోసారి మూవీ లవర్స్ కు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నట్టు చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. Sharwa 36లో డాక్టర్ రాజశేఖర్ శర్వానంద్ తండ్రి పాత్రలో నటిస్తుండగా.. బ్రహ్మాజి, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
బైకర్ గ్లింప్స్..
Janhvi Kapoor | రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్
Dil Raju | సల్మాన్ ఖాన్‌తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు .. క్రేజీ అప్డేట్ ఏంటంటే..!
Mass Jathara Review | ‘మాస్ జాతర’ రివ్యూ.. రవితేజ కొత్త మూవీ ఎలా ఉందంటే.?