Dil Raju | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి భారీ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం, ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాతల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌తో పాటు దిల్ రాజు డ్రీమ్స్ అనే కొత్త విభాగం ద్వారా యంగ్ టాలెంట్‌కి అవకాశాలు కల్పిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ ,‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిల్ రాజు, ఇప్పుడు మరోసారి ప్యాన్-ఇండియా స్థాయిలో ప్రాజెక్ట్‌లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో పలు బడా హీరోలతో సినిమాలు తెరకెక్కించే ప్రణాళికలో ఉన్న ఆయన, ఈసారి బాలీవుడ్ వైపు దృష్టి సారించారు.
వివరాల్లోకి వెళ్తే దిల్ రాజు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారని వినికిడి. వీరిద్దరి కాంబినేషన్లో క్లాస్ టచ్‌తో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకోనుందని టాక్. ఇప్పటికే సల్మాన్ ఖాన్ స్క్రిప్ట్‌ను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక, టెక్నీషియన్ల వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇక సల్మాన్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే .. ఈసారి లాభాల్లో వాటా తీసుకోవడానికి అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించాలనుకుంటున్నారని, సినిమాని ప్యాన్-ఇండియా లెవెల్లో విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నారని టాక్. గతంలో ‘హిట్’, ‘జెర్సీ’ వంటి సక్సెస్ఫుల్ రీమేక్‌లతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు, ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి మళ్లీ బాలీవుడ్ మార్కెట్లో తన ముద్ర వేయడానికి రెడీ అవుతున్నారు. దిల్ రాజు – వంశీ పైడిపల్లి – సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో రాబోతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.