నిహాల్ కోదాటి, అశ్లేష ఠాకూర్ జంటగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘శాంతల’. శేషు పెద్దిరెడ్డి దర్శకుడు. ఇర్రంకి సురేశ్ నిర్మాత. ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్.రామారావు చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఊహకందని కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా తప్పక విజయవంతం అవుతుందని నిహాల్ నమ్మకం వ్యక్తం చేశాడు. మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించిన దర్శక, నిర్మాతలకు ఆశ్లేష కృతజ్ఞతలు తెలిపింది. ఇంకా చిత్రబృందం అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.