Salmankhan | బాలీవుడ్లో ఖాన్త్రయంకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్.. ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది.. అభిమానులకు పండగే.. చాలా రోజుల తర్వాత అలాంటి అరుదైన సన్నివేశానికి సౌదీ అరేబియాలోని ఓ ఈవెంట్ వేదికైంది.
ఈవెంట్లో స్టేజీపై సల్మాన్ ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం గురించి మాట్లాడుతూ.. నాది అమీర్ఖాన్ది సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం. కానీ షారుక్ ఖాన్ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చాడు. టాలెంట్‌తోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడన్నాడు.
అయితే ఈ కామెంట్స్‌పై షారుక్ ఖాన్ స్పందిస్తూ.. తాను కూడా అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యుడినని.. అందువల్ల తనకు కూడా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్టేనని.. అమీర్, సల్మాన్ ఇద్దరూ తనకు స్పూర్తి అన్నాడు. ఇక ఈ సమాధానానికి ఫిదా అయిన అమీర్ ఖాన్ అందుకే షారుక్ ఖాన్ స్టార్ అని ప్రశంసించాడు.
మరోవైపు స్టార్ అనే ట్యాగ్ తమకు నచ్చదన్న సల్మాన్ ఖాన్.. మేం ఇంట్లో అందరిలాగే ఉంటాం. మాతో పనిచేసిన డైరెక్టర్లు, నిర్మాతలు, రచయితలు, మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకుల వల్లే మేం ఈ స్థాయిలో ఉన్నామన్నాడు. ఒకే వేదికపై ముగ్గురు స్టార్ హీరోలు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.