Met Gala | మెట్ గాలా (Met Gala) .. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో (biggest fashion event) ఒకటి. న్యూయార్క్ (NewYork) నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) లో ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తుంటారు. ఈ ఏడాది కూడా మెట్గాలాకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది.
ఈ ఏడాది మే 5న ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్యాషన్ ఈవెంట్‌కు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ముస్తాబవుతోంది. ఈ సారి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), స్టార్ నటి కియారా అడ్వాణీ మెట్ గాలా 2025లో అరంగేట్రం చేయనున్నారు. ప్రస్తుతం కియారా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. ‘సూపర్‌ఫైన్ : టైలరింగ్ బ్లాక్ స్టైల్’ అనే థీమ్‌తో ఆమె అందమైన దుస్తుల్లో ఈ గాలాలో మెరవనున్నారు. ఇప్పటికే పలువురు బీటౌన్ తారలు ఈ మెట్‌గాలాలో సందడి చేసిన విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా, అలియాభట్, దీపికా పదుకొణె, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ, నటాషా పూనవాలా తదితరులు రెడ్ కార్పెట్‌పై వినూత్న దుస్తులు ప్రదర్శిస్తూ సందడి చేసిన విషయం తెలిసిందే.
ఇషా అంబానీ టు ఆలియా.. గాలాలో ఇండియన్ సెలబ్రిటీల ఫ్యాషన్ మూమెంట్
.@nickjonas and @priyankachopra attended the #MetGala in Valentino looks.
Priyanka was styled in a black cady dress with black bow and leather gloves along with a black faille cape with white bow, while Nick opted for a #ValentinoBlackTie blazer, trousers and silk faille tie. pic.twitter.com/YbuPIwqlh6
— Valentino (@MaisonValentino) May 2, 2023
Also Read..
Nandamuri Balakrishna | పద్మభూషణ్ నాకు సరైన సమయంలోనే వచ్చింది : బాలకృష్ణ
Samantha | సమంత బర్త్ డే సందర్భంగా ఆమె గుడిలో అన్నదానం, సేవా కార్యక్రమాలు