Nandamuri Balakrishna | పద్మభూషణ్ నాకు సరైన సమయంలోనే వచ్చింది : బాలకృష్ణ
Nandamuri Balakrishna | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
Nandamuri Balakrishna | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో సోమవారం ఘనంగా జరుగగా.. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా నటుడు నందమూరి బాలకృష్ణ ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే తనకు పద్మభూషణ్ రావడంపై మీడియాతో స్పందించాడు బాలయ్య.
”నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనంద సమయంలో నా అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే, భారత ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కొందరు అభిమానులు ఈ అవార్డు నాకు ఎప్పుడో రావాల్సిందని భావిస్తుండవచ్చు. వారికి నేను చెప్పేది ఒక్కటే – నాకు ఈ పద్మభూషణ్ పురస్కారం సరైన సమయంలోనే లభించింది.
ఈ సంవత్సరం నాకు ఎంతో ప్రత్యేకమైనది. నేను నటించిన నాలుగు సినిమాలు వరుసగా సూపర్ హిట్ సాధించాయి. అంతేకాకుండా, నేను క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తయింది. ముఖ్యంగా, నా సినీ జీవితం ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఈ గౌరవం దక్కడం మరింత ఆనందంగా ఉంది. ఈ గుర్తింపు నాకు మరింత స్ఫూర్తినిస్తుంది. మీ అందరి ప్రేమ, అభిమానానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానంటూ” బాలయ్య చెప్పుకోచ్చాడు.
#WATCH | Delhi: Actor and Andhra Pradesh MLA Nandamuri Balakrishna received Padma Bhushan award this evening.
He says, “…I am overjoyed…I have 4500 registered fans and I am thankful to all of them. I also thank the Government of India. In 50 years of career, my work as an… pic.twitter.com/shxPBcvzZf
— ANI (@ANI) April 28, 2025
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

