Samantha | చెన్నై చంద్రం సమంత ఇప్పుడు తెలుగు హీరోయిన్గా మారింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత అందరు ఆమెని తెలుగు అమ్మాయిగానే భావించారు. విడాకుల తర్వాత కూడా సమంత తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచే ఉంది. గ్లామర్ హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన సమంత తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకొని సోలో హీరోయిన్గా సినిమాలు చేస్తూ మంచి హిట్స్ అందుకుంది. అలానే పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఈ క్రమంలోనే ఈమెకు ఓ అభిమాని గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకొన్నాడు. సమంతను దేవతగా మార్చి కొలుస్తున్నారు.
బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్ నటి సమంతకు వీరాభిమాని కాగా, ఆమె నటనతో పాటు చేసే సేవా కార్యక్రమాలకి ఎంతో ఆకర్షితుడయ్యాడు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంతో సందీప్ ఆమెకి గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. 2023 ఏప్రిల్ 28న తెనాలి సందీప్ గుడిని ప్రారంభించాడు.సమంత బర్త్ డే( ఏప్రిల్ 28) సందర్భంగా ఇప్పుడు ఆమె కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మండపం ఏర్పాటు చేసి అందంగా అలకరించి ఆ మండపంలో రెండు రకాల సమంత విగ్రహాలను నెలకొల్పి తన అభిమానాన్ని చాటుకొన్నాడు సందీప్. ఇక ఆ గుడికి టెంపుల్ ఆఫ్ సమంత అని పేరు పెట్టాడు.
అయితే సమంత బర్త్ డే సందర్భంగా అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. అనంతరం మాట్లాడుతూ.. నేను సమంతకి చాలా పెద్ద అభిమానిని. గత మూడు సంవత్సరాలుగా సమంత పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నాని చెప్పాడు. ఆవిడ మీద ఉన్న అభిమానంతోనే ఇలా గుడి కట్టాను. ఇది కట్టి మూడు సంవత్సరాలు అవుతుంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్నాను. అలాగే ఈ ఏడాది కూడా కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించాను. పేదలకు సమంత చేసే సాయం నాకు నచ్చి ఆవిడ మీద ఉన్న అభిమానంతోనే ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నాను అని సందీప్ తెలియజేశాడు.
బాపట్లలో హీరోయిన్ సమంతకు గుడి కట్టిన అభిమాని సందీప్ pic.twitter.com/W8NHEXCBUC
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2025