Rithu Chowdary | జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన వారిలో రీతూ చౌదరి ఒకరు. ఆమె పలు సీరియల్స్, టీవీ షోస్ కూడా చేసింది. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలతో పాటు పలు టీవీ షోలలో మాత్రమే సందడి చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో కాస్టింగ్ కౌచ్‌పై కూడా నోరు విప్పింది. తాను పదో తరగతి చదువుతున్నప్పుడే అవకాశాల కోసం ట్రై చేసిందట. ఖమ్మంలో ఉండే తాను సీరియల్ ఆడిషన్ కోసం వాళ్ల నాన్నతో కలిసి హైదరాబాద్ వచ్చిందట. అయితే ఆడిషన్ అయ్యాక మేనేజర్ వచ్చి ఒక సీరియల్ యాక్టర్ పేరు చెప్పి అతనితో అలా ఉంటేనే అవకాశం వస్తుందని అన్నాడట.
నువ్వు ఎవరిని తీసుకురావొద్దు, ఒక్కదానివే రావాలని చెప్పాడట. నాకు అప్పుడు వెలగలేదు. చిన్నపిల్లగా ఉన్నప్పుడే నన్ను అలా అడిగారు. సీరియల్ యాక్టర్ అలాంటి వాడా అని షాక్ అయ్యాను. ఇక నా కెరీర్ మొదలయ్యాక ఆ ఫేమస్ సీరియల్ యాక్టర్ తోనే ఓ సీరియల్ లో నటించాను. అప్పుడు ఆ యాక్టర్ ని.. ఆ సంఘటన గురించి అడగాలి అని అనుకున్నా కాని అడగలేకపోయాను. ఆ తర్వాత నాకు మళ్లీ అలాంటి సమస్య ఎదురు కాలేదు అని పేర్కొంది రీతూ చౌదరి. ఒకప్పుడు ట్రోల్స్, కామెంట్లని చాలా సీరియస్‌గా తీసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఏదైనన లైట్. నాన్న ఉన్నప్పుడు నాకు ఇవేం తెలియవు. అన్ని నాన్ననే చూసుకునేవారు.
మా అమ్మానాన్నలది లవ్ మ్యారేజ్. మా అమ్మని చాలా అపురూపంగా నాన్న చూసుకున్నారు. నన్ను బాగా చూసుకునేవారు. ఉదయం షూటింగ్ ఉందంటే నా కన్నా ముందు లేచి జ్యూస్, ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చేవారు. నాన్న నాతో ఒక ఫ్రెండ్‌లా ఉండేవారు. నాన్నని నేను ఒరేయ్ అని పిలుస్తా. మందు కూడా కలిసి కొట్టాం. అంత కూల్‌గా ఉంటారు నాన్న. ఇప్పుడు నాన్న లేకపోయే సరికి చాలా బాధగా ఉంది. నా ఫ్యామిలీని నేనే చూసుకోవాలని అర్థమైంది. నాన్న చనిపోయినప్పుడు మా ఇంట్లో కూర్చొని బంధువులు నవ్వుకోవడం చూసి నాకు రియాలిటీ అర్థమైంది. నాన్న నన్ను ఏ రోజు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పలేదు. టోర్న్ జీన్స్, క్రాప్ టాప్స్ ఇలా నాకు నచ్చిన బట్టలు నేను వేసుకుంటా.. గుడికి వెళ్తే చీర కట్టుకుంటా, పబ్‌కి వెళ్తే ట్రెండీ డ్రెస్ వేసుకుంటా.. నా జీవితం నాకు నచ్చినట్లు నేనుంటా, ఎవరికి సమాధానం చెప్పాల్సిన పనిలేదు అని రీతూ పేర్కొంది.