ShahRukh Khan | బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కి ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన నటుల జాబితాలో చోటు దక్కింది. బ్రిటన్‌కు చెందిన ‘ఎంపైర్’ మ్యాగజైన్ ‘50 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆల్‌టైమ్’ పేరుతో విడుదల చేసిన జాబితాలో.. హాలీవుడ్ ప్రముఖ నటులు డెంజల్ వాషింగ్టన్, టామ్ హాంక్స్, ఆంథోనీ మార్లన్ బ్రాండో వంటి దిగ్గజాలకు చోటు దక్కింది. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కిన ఏకైక నటుడు షారుక్ కావడం విశేషం.
నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న షారుఖ్ సాధించిన విజయాలను, అతడికున్న అభిమానుల గురించి ‘ఎంపైర్’ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతేకాదు, ఓ సినిమాలో అతడు చెప్పే ‘జీవితం రోజూ మన ఊపిరిని కొద్దికొద్దిగా హరిస్తుంది.. అదే బాంబు అయితే ఒకేసారి ప్రాణం తీస్తుంది’ అన్న డైలాగ్ అతడి కెరియర్లోనే బెస్ట్ డైలాగ్ అని చెప్పుకొచ్చింది. షారుక్.. దేవదాస్, మై నేమ్ ఈజ్ ఖాన్, కుఛ్ కుఛ్ హోతా హై వంటి సినిమాల్లో అద్భుతంగా నటించాడంటూ కొనియాడింది.
ప్రస్తుతం షారుక్.. ‘పఠాన్’, ‘జవాన్’ ‘ఢుంకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ‘పఠాన్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్‌కు రెడీ అవ్వగా, జవాన్ జూన్ 2న, ఢుంకీ వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహకాలు చేస్తోంది.