Shah Rukh Khan | షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల గురించే ఎక్కువగా చర్చ నడుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ హీరో కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ డంకీ (Dunki). ఈ చిత్రానికి బాలీవుడ్ (Bollywood) స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ఢిల్లీ భామ తాప్సీ పన్ను ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది.
డంకీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటరల్లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో ఫుల్బిజీగా ఉంది షారుఖ్‌ఖాన్ టీం. Dunki Drop 2 రూపంలో లాంఛ్ చేసిన డంకీ ఫస్ట్ సింగిల్ Lutt Putt Gaya సాంగ్ హీరోహీరోయిన్ల మధ్య సాగే ట్రాక్.. షారుఖ్‌ఖాన్ ఎనర్జీ లెవల్స్‌తో సాగే డ్యాన్స్ అభిమానులకు విజువల్ ట్రీట్ అందిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 17న గ్లోబల్ విలేజ్‌లో షారుఖ్‌ఖాన్ టీం సందడి చేసింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఇదే సాంగ్‌కు స్టేజ్‌పై డ్యాన్స్ చేసి అభిమానులను ఫిదా అయిపోయేలా చేశాడు బాద్ షా. మరోవైపు జవాన్ సాంగ్‌కు కూడా అదిరిపోయే స్టెప్పులేశాడు. ఇప్పుడీ వీడియోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
డంకీ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాండ్‌గా లాంఛ్ అయ్యాయని అప్డేట్ వచ్చిందని తెలిసిందే. నే డంకీ చిత్రంలో బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే Dunki Drop 1, Dunki Drop 2, Dunki Drop 3, Dunki Drop 4, Dunki Drop 5 అంటూ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్తో అభిమానులను ఖుషీ చేస్తోంది షారుఖ్ ఖాన్ టీం. ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, జియో స్టూడియో బ్యానర్లపై రాజ్‌కుమార్ హిరానీ, గౌరీఖాన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అభిజాత్ జోషి, రాజ్‌కుమార్ హిరానీ, కనికా ధిల్లాన్ కథనందిస్తున్నారు.
షారుఖ్‌ఖాన్ క్రేజీ డ్యాన్స్..
when srk is happy, the entire generation is happy ❤️#ShahRukhKhan pic.twitter.com/c521ZtmKfQ
— MAHA SRK FAN (@MahaanSRK) December 18, 2023
58 Ke Age Mein Aise Baalon Dukan, Upar Se Ponytail Hair, Next Level Charm..🔥#ShahRukhKhan#DunkiAdvanceBookingpic.twitter.com/DYhrHHUKbt
— 😎Sourav Srkian Das😎 (@SrkianDas04) December 18, 2023
Shah Rukh Khan at Global Village Dubai. I tried to compile everything in one edit ❤️#ShahRukhKhan pic.twitter.com/6DvDVLoNnU
— srkvibe 🇮🇳 (Renu) – Fan account (@srkvibe) December 18, 2023
Dunki Drop 5 అప్డేట్..
Coming up….#DunkiDrop5 – #OMaahi Promotional Video Out Soon!#Dunki releasing worldwide in cinemas on 21st December, 2023. pic.twitter.com/HKiyOzBcPw
— Rajkumar Hirani (@RajkumarHirani) December 11, 2023
Lutt Putt Gaya సాంగ్..
Loved #LuttPuttGaya ❤️😍
Will be a Chartbuster for sure just like JJP and Chaleya#SRK doesn’t age at all, the energy mahn 🥵🥶
The innocence of 90s is full on in this song ❤️
And #SRK chemistry with #TaapseePannu spot on
Cute!! 😍
A must needed break from Action movies!! pic.twitter.com/UNp6ihCpiZ
— 𝙰𝚗𝚞𝚓 🇮🇳𝚂𝚁𝙺𝚒𝚊𝚗🇮🇳 (@anujrocks44) November 22, 2023
Dunki Drop 1 ఫస్ట్ వీడియో..