మంగళవారం 26 జనవరి 2021
Cinema - Oct 26, 2020 , 15:24:01

ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ టాప్ లేప‌నున్న హౌజ్‌మేట్స్

ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ టాప్ లేప‌నున్న హౌజ్‌మేట్స్

సోమవారం వ‌చ్చిందంటే నామినేషన్ ర‌చ్చ అంద‌రికి బీపీలు పెంచుతుంది . ముందు రోజే ఎవ‌రిని నామినేట్ చేయాలి, ఏ కార‌ణం చెప్పాలి అనే ప‌క్కా ప్లాన్ తో రంగంలోకి దిగుతున్న హౌజ్‌మేట్స్ త‌మ‌కు న‌చ్చ‌ని వారిని నామినేట్ చేసి సరికొత్త గేమ్‌కు శ్రీకారం చుడుతున్నారు. ఈ రోజు ఏడోవారంకు సంబంధించిన నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుండ‌గా, అందుకు సంబంధించి ప్రోమో విడుద‌లైంది.

తాజాగా విడుద‌లైన ప్రోమోలో బిగ్ బాస్ ఓ సుత్తి ఇచ్చి నామినేట్ చేయాల‌నుకునే వారి ఫోటో ఫ్రేమ్స్‌ని ప‌గ‌ల‌గొట్టాల‌ని చెప్పారు. నామినేష‌న్స్ అంటే గొడ‌వ‌లు త‌ప్ప‌వు కాబ‌ట్టి ఈ వారం అరియానా-మెహ‌బూబ్, లాస్య‌- అవినాష్‌, అఖిల్‌-రాజ‌శేఖ‌ర్, మోనాల్‌- అభిజిత్ ల మ‌ధ్య మాట‌ల ఫైట్ త‌ప్ప‌నిస‌రి అని  తాజా ప్రోమోని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. నామినేష‌న్ ర‌చ్చ‌తో ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ హీటెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. 


logo