ఇటీవలే ప్రభాస్ (Prabhas)పెద్ద నాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు దూరమైన బాధలో నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారు ఆయన కుటుంబసభ్యులు. కాగా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఆదిపురుష్, సలార్ (Salaar), ప్రాజెక్టు కే షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా ప్రభాస్ త్వరలోనే సలార్ షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజా టాక్ ప్రకారం ఈ నెల 19న చిత్రీకరణలో జాయిన్ అయ్యాడట. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City)లో ప్రభాస్ కోసం 12 సెట్స్ ఎదురుచూస్తున్నాయట. ప్రతీ సెట్లో 2-3 రోజులు షూటింగ్ నిర్వహించనున్నట్టు ఇన్ సైడ్ టాక్. కాగా షూటింగ్ డేస్‌తో సంబంధం లేకుండా ప్రాంగణంలో సెట్స్ ఉన్నంత వరకు నిర్మాతలు స్టూడియోకి అద్దె చెల్లించాల్సి ఉండటంతో..వారికి భారం తగ్గించేందుకు ప్రభాస్ షూట్‌ను స్పీడప్ చేయనున్నాడని ఫిలింనగర్లో వార్త హల్ చల్ చేస్తోంది.
సలార్ రెండు పార్టులుగా రాబోతుంది. కేజీఎఫ్ లాంటి హిట్ అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel)-మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ క్రేజీ కాంబినేషన్ మరోసారి సలార్‌కు పనిచేస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.