e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 27, 2022
Home News నీకు సినిమాలు అవసరమా? నువ్వేం చేయగలవు? అని హేళ‌న చేశారు.. కానీ..

నీకు సినిమాలు అవసరమా? నువ్వేం చేయగలవు? అని హేళ‌న చేశారు.. కానీ..

Abhishekam serial fame Hanvika | ‘నీకు సినిమాలు అవసరమా? నువ్వేం చేయగలవు?’ అని చులకన చేసిన వారికి వరుస ఆఫర్లతో సమాధాన మిస్తూ.. బుల్లితెర మీద దూసుకుపోతున్నది ఈటీవీ ‘ అభిషేకం ’ సీరియల్‌ ఫేమ్‌ హాన్విక శ్రీనివాస్‌. అవరోధాలు ఎదురైనా, తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులకు ఎప్పుడూ రుణపడి ఉంటానంటూ హాన్విక ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..

Abhishekam serial fame Hanvika

మాది నర్సీపట్నం. చదువంతా వైజాగ్‌లోనే. చిన్నప్పటినుంచీ పాఠ్య పుస్తకాలు తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. కరోనాతో అంతా మారిపోయింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో కూర్చుని ఏం చేయాలో తోచక, ఫ్రెండ్స్‌తో సరదాగా ‘టిక్‌టాక్‌’, ‘ఇన్‌స్టా’ రీల్స్‌ చేయడం ప్రారంభించాను. వాటిని చూసిన ఓ డైరెక్టర్‌ నన్ను పిలిపించారు. తన సినిమాలో హీరోయిన్‌గా చేయమని అడిగారు. ‘అసలు నేను చేయగలనా?’ అనిపించింది. అమ్మానాన్న ఇచ్చిన ధైర్యంతో ఓకే చెప్పాను. అనుకోకుండా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. పరిశ్రమలో కొనసాగాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఈటీవీ ‘అభిషేకం’ సీరియల్లో అవకాశం వచ్చింది.

చులకనగా మాట్లాడారు..

- Advertisement -

నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ని. సంగీతం కూడా నేర్చుకున్నా. తాతయ్య నాటకాలు వేసేవారు. ఆయన నటనను చూస్తూ పెరగడం వల్ల నాకూ ఆసక్తి పెరిగింది. కానీ నటనను వృత్తిగా ఎంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. సివిల్స్‌కు ఎంపికై సమాజసేవ చేయాలన్నది నా ఆశయం. అయితే, ఇండస్ట్రీకి వెళ్లాలనుకుంటున్నానని తెలియగానే బంధువులు, తెలిసిన వాళ్లు చులకనగా మాట్లాడారు. సినిమా పరిశ్రమ అంటే అంత చిన్నచూపు ఉందని అనుకోలేదు. ఆ సమయంలో అమ్మానాన్న అండగా నిలిచారు. మనం నడిచే మార్గం సరైంది అయితే, ఎందులోనైనా విజయం సాధించవచ్చని ధైర్యం చెప్పారు.

ఎవరి అండా లేకుండా..

మాకు తెలిసిన వాళ్లు, బంధువులు పరిశ్రమలో మంచి స్థాయిలో ఉన్నారు. అయినా ఎవరినీ సాయం అడగలేదు. అప్పుడు చులకన చేసిన వాళ్లే ఈరోజు ‘అవును. మా అమ్మాయే’ అని చెప్పుకొంటున్నారు. ఓ పెద్ద దర్శకుడి భార్య మా అమ్మకి అత్త. ‘ఎవరు ఏమన్నా వినకండి. మీరేం చేయాలనుకుంటే అదే చేయండి’ అని ధైర్యం చెప్పారామె. అమ్మ నాకోసం తన బిజినెస్‌లు వదులుకుని మరీ హైదరాబాద్‌ వచ్చింది.

సివిల్స్‌ రాస్తా..

నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనే ఆశయంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయననీ, కుటుంబానికి చెడ్డపేరు తీసుకురాననీ నాన్నకు మాటిచ్చా. సీరియల్స్‌లో నటిస్తూనే సివిల్‌ సర్వీసు పరీక్షలకు సిద్ధం అవుతాను. ఒక్కోమెట్టూ ఎక్కితేనే నిలకడగా, దృఢంగా నిలుస్తామనేది నా నమ్మకం. నటన కూడా ఒక వృత్తే. ఇందులోనూ మంచీచెడు ఉంటాయి. మంచి దార్లో వెళితే మంచే జరుగుతుంది. నేను నమ్మే సిద్ధాంతం ఇదే. ఓ అమ్మాయిగా, ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒక సూచన.. ఎప్పుడూ కూతుళ్లను తక్కువ చేసి చూడొద్దు. వారిలోని ప్రతిభను అణచివేయొద్దు. ఏదో ఒక కళలో శిక్షణ ఇప్పించండి. అది ఏదో ఒక మలుపులో ఉపయోగపడుతుంది.

వరుస సినిమాలు..

మొదటి సినిమా ఆగిపోయినా, ఆ చిత్ర దర్శకుడు ఇచ్చిన సలహా వల్లే నా జీవితం మలుపు తిరిగింది. ఆయన కలవమని చెప్పిన వ్యక్తులను కలిశాను. హైదరాబాద్‌లో ఉంటే అవకాశాలు వస్తాయని కూడా ఆయనే చెప్పారు. దీంతో ఇక్కడికి వచ్చేశా. ప్రస్తుతం రాజశేఖర్‌గారి సినిమాలో ఆయనకు కూతురిగా చేస్తున్నా. మరో రెండు చిత్రాలతోపాటు బిగ్‌బాస్‌ విన్నర్‌ కౌశల్‌ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తున్నా. ‘అభిషేకం’ సీరియల్లో పనిచేయడం ద్వారా చాలా నేర్చుకున్నా. ఎంతోమంది స్నేహితులను సంపాదించుకున్నా. నా ఫోకస్‌ మాత్రం బిగ్‌స్క్రీన్‌ పైనే.

ప్రవళిక వేముల

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

Nayanthara remuneration | గాడ్ ఫాద‌ర్‌కు న‌య‌న‌తార పారితోషికం వింటే షాకే..!

అద్భుతం’ సినిమా రివ్యూ

Sneha Business Fraud | న‌టి స్నేహ‌కు రూ.26 ల‌క్ష‌లు టోక‌రా..పీఎస్‌లో ఫిర్యాదు..!

కిస్మస్‌, సాయిపల్లవి..ఈ కాంబినేషన్‌ నానికి ఎందుకు సెంటిమెంట్‌?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement