Nayanthara remuneration | గాడ్ ఫాదర్‌కు నయనతార పారితోషికం వింటే షాకే..!
ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు గాడ్ ఫాదర్ లో నటించే అవకాశాన్ని అందుకుంది నయనతార (Nayanthara). ఇపుడు నయనతార గాడ్ ఫాదర్ సినిమాకు తీసుకుంటున్న పారితోషికం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఓ వైపు స్టార్ హీరోలతో నటిస్తూనే..మరోవైపు ఫీమేల్ ఓరియెంటెడ్ కథాంశాలతో లేడీ సూపర్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకుంది నయనతార (Nayanthara). ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు గాడ్ ఫాదర్ లో నటించే అవకాశాన్ని అందుకుంది. స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi), మోహన్ రాజా (Mohan Raja) కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుంది.
పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లూసిఫర్ రీమేక్ అని తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్లో మంజు వారియర్ పోషించిన పాత్రలో నయనతార కనిపించనుంది. అయితే ఇపుడు నయనతార గాడ్ ఫాదర్ సినిమాకు తీసుకుంటున్న పారితోషికం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం నయన్ ఈ చిత్రానికి రూ.4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. తెలుగులో ఇప్పటివరకు హీరోయిన్లకు ఇస్తున్న పారితోషికంలో ఇదే అత్యధికం.
ఇప్పటికే నయనతార బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆమె లుక్‌ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. సైరా నరసింహారెడ్డి తర్వాత చిరంజీవితో నయనతార రెండో సినిమా ఇది. గాడ్ ఫాదర్ చిత్రానికి ఎస్ థమన్ (Thaman) మ్యూజిక్ డైరెక్టర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్
Kangana Ranaut Vs Vir Das | స్టార్ కమెడియన్‌పై చర్యలకు కంగనా డిమాండ్
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

