టాలీవుడ్ (Tollywood) పాన్ ఇండియా ప్రాజెక్టుగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప..ది రైజ్ (Pushpa) ఏ స్థాయిలో బాక్సాపీస్ ను షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్, కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika mandanna) కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై కలెక్షన్ల వర్షం కురిపించింది. పుష్పరాజ్, శ్రీవల్లిలా డీగ్లామరైజ్డ్ పాత్రలో మెరిసిన తీరుకు పుష్ప హిందీ వెర్షన్ (Pushpa Hindi version)కు కూడా అద్బుతమైన స్పందన వచ్చింది.
ఇక ఇపుడు ఆడియెన్స్ ఫోకస్ అంతా పుష్ప 2పైనే పడ్డది. రెండోపార్టుగా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. హిందీ వెర్షన్‌పై హైప్ మరింత ఎక్కువగా క్రియేట్ అవుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రంగంలోకి దిగనున్నాడట. పుష్ప 2ను హిందీలో అల్లు అరవింద్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్‌తో కలిసి స్పెషల్ మార్కెటింగ్, ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. పుష్ప 2 షూటింగ్‌ను త్వరలోనే మొదలుపెట్టనుంది సుకుమార్ టీం.
ఇప్పటికే గజినీ లాంటి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమాను భారత ప్రేక్షకులకు అందించిన అల్లు అరవింద్ పుష్ప 2ను విడుదల చేయబోతున్నారంటే మార్కెట్ కూడా అద్బుతంగా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం షాహిద్ కపూర్ తెలుగు రీమేక్ ప్రాజెక్టు జెర్సీ ని నిర్మిస్తున్నారు అల్లు అరవింద్.