ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది గోవా బ్యూటీ లైలా (Laila) . ఆ తరువాత తెలుగులో పలు చిత్రాల్లో నటించించి. చివరగా 2006లో మలయాళ సినిమాలో నటించిన లైలా ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. మళ్లీ 16 సంవత్సరాల తర్వాత కార్తీ నటించిన సర్దార్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
అక్టోబర్ 21న సర్దార్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపథ్యంలో టీం చిట్‌చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా లైలా ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. తాను టాలీవుడ్(Tollywood)లో సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నానని మనసులో మాట బయటపెట్టింది లైలా. అంతేకాదు అవకాశమొస్తే తాను తల్లి పాత్రలు, సిస్టర్ పాత్రలు చేయడానికైనా రెడీ అని క్లారిటీ ఇచ్చేసింది. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది లైలా.
మరి ఈ సీనియర్ నటిని సినిమాల్లో తీసుకునేందుకు ఏ దర్శకనిర్మాతలు ముందుకు వస్తారనేది రానున్న రోజుల్లో తెలియనుంది. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్టు తాజా అప్డేట్తో అర్థమవుతుంది.