మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య టీం తొలిసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..నాకు గతంలో ఓ సీనియర్ హీరో చెప్పారు. మనల్ని తెరపై ఎలా చూపించాలో మనకంటే.. ఇక్కడున్న ప్రొఫెషనల్ రైటర్స్ కంటే.. మనల్ని అభిమానించే ఒక అభిమాని ఎప్పుడైనా డైరెక్టర్ అయితే మాత్రం అతను చూపించినట్టుగా ఎవరూ మనల్ని చూపించరు. ఒకవేళ అలాంటి అవకాశమొస్తే ఖచ్చితంగా చెయ్యి అని అన్నాడు. అది నాకు బలంగా గుర్తుండిపోయిందన్నారు.
బాబీ, వాళ్ల నాన్నగారు నాకు ఎంత వీరాభిమానులో తెలియజేసినపుడు నాకు ఎంతో ఆనందం వేసింది. అలాంటి అభిమాని బాబీ ఓ కథతో వచ్చాడంటే నేను ఊహించని విధంగా నన్ను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తాడని బలమైన నమ్మకం. ఈ సినిమా గురించి ఎంతైనా ఊహించుకోండి.. దానికి మించే ఉంటుంది. ప్రతీ ఒక్కరూ వాళ్ల బాధ్యతలను ప్రేమించి ఈ సినిమా చేశారన్నాడు చిరంజీవి.
హీరోయిన్ శృతిహాసన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. చలిలో శారీ కట్టుకొని డ్యాన్స్ చేయడమంటే చాలా కష్టం. ఆమె చాలా వణికిపోతూ ఉండేది. కానీ తెరపై అలాంటిదేమి కనిపించనీయకుండా చాలా గ్లామరస్‌గా కనిపిస్తోందన్నాడు చిరంజీవి.
వాల్తేరు వీరయ్య టీం ప్రెస్ మీట్..
Read Also : Uravasi Rautela | చిరంజీవితో పనిచేస్తున్నానా అని షాకయ్యా : ఊర్వశి రౌటేలా
Read Also : Ranveer Singh | క్రేజీ టాక్.. రవితేజ సినిమాపై కన్నేసిన రణ్వీర్ సింగ్
Read Also : GV Prakash Kumar | సూరారై పోట్రు రీమేక్‌పై జీవీ ప్రకాశ్ కుమార్ అప్డేట్