బాలీవుడ్ యాక్టర్ రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) నటించిన సర్కస్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రణ్వీర్ సింగ్‌కు ఈ చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. కాగా ఈ టాలెంటెడ్ యాక్టర్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. రణ్వీర్ సింగ్ ఇప్పటికే టెంపర్ హిందీ రీమేక్‌లో నటించాడు. కాగా ఇపుడు మరో తెలుగు సినిమాపై రణ్వీర్ సింగ్ కన్నేశాడన్న అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇంతకీ ఆ సినిమా ఏంటనే కదా మీ డౌటు. రవితేజ (Ravi Teja)కు గ్రాండ్ కమ్‌బ్యాక్ ఎంట్రీ అందించిన క్రాక్ (Krack). గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇపుడిదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి హిట్టు కొట్టాలని చూస్తున్నాడట రణ్ వీర్ సింగ్. హిందీ వెర్షన్ ను కూడా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయనున్నాడని ఇన్ సైడ్ టాక్. టాలీవుడ్ లీడింగ్ బ్యానర్లు మైత్రీ మూవీ మేకర్స్- గీతా ఆర్ట్స్ హిందీలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రేజీ సినిమా రీమేక్‌పై రానున్న రోజుల్లో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి మరి. గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలకృష్ణతో చేస్తున్న వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. గోపీచంద్ మలినేని ఈ సినిమా తర్వాత రణ్ వీర్ సింగ్ సినిమాను లైన్లో పెడతాడా..? లేదా..? అన్నది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.