Uravasi Rautela | చిరంజీవితో పనిచేస్తున్నానా అని షాకయ్యా : ఊర్వశి రౌటేలా
పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) చిత్రానికి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య టీం తొలిసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా బాస్ పార్టీ సాంగ్‌లో మెరిసిన ఊర్వశి రౌటేలా మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమలోకి వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ సాంగ్‌తో నా డెబ్యూ ఇస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌజ్‌లో నటించే అవకాశమిచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. చిరంజీవిగారితో పనిచేశాక ఆయన సూపర్ స్టార్ కాకుండా మెగాస్టార్ ఎందుకయ్యారో తెలిసింది.
బాస్ పార్టీ సాంగ్ పూర్తి చేసినపుడు నాలుగేండ్ల కిందటి సైమా క్లిప్పింగ్ చూశా. మీరు ఎవరితో పనిచేయాలని ఎక్జయిటింగ్‌గా ఉన్నారని ఓ జర్నలిస్ట్ నన్ను అడిగారు. నేను చిరంజీవి సార్ అని చెప్పాను. సెట్స్ లో ఉన్నపుడు చిరంజీవి సార్‌తో పనిచేస్తున్నానా అని షాకయ్యా. నేను చాలా మంది సూపర్స్టార్లతో నటించాను. కానీ మొదటిసారి మెగాస్టార్‌తో నటించా. చాలా చాలా హ్యాపీగా ఉంది. కానీ రవితేజ మాతో ఈ పాటలో లేడు. భవిష్యత్‌లో రవితేజతో కలిసి నటిస్తానని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది ఊర్వశి రౌటేలా .
వాల్తేరు వీరయ్య టీం ప్రెస్ మీట్..
బాస్ పార్టీ లిరికల్ వీడియో సాంగ్..
వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్..
Read Also : Ranveer Singh | క్రేజీ టాక్.. రవితేజ సినిమాపై కన్నేసిన రణ్వీర్ సింగ్
Read Also : GV Prakash Kumar | సూరారై పోట్రు రీమేక్‌పై జీవీ ప్రకాశ్ కుమార్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

