Selfish | ‘రౌడీ బాయ్’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు యువహీరో ఆశిష్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘సెల్ఫిష్’. కాశీ విశాల్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా కొత్త స్టిల్స్‌ను విడుదల చేశారు. ‘వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది. యువతరానికి కనెక్ట్ అయ్యే అన్ని అంశాలుంటాయి. మిక్కీ జే మేయర్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆచార్య వేణు, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి, రచన-దర్శకత్వం: కాశీ విశాల్.