Siddu Jonnalagadda | మూవీ లవర్స్‌కు వినోదాన్ని అందించేందుకు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు మల్టీప్లెక్స్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిసిందే. ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఈ మల్టీ ప్లెక్స్ జాబితాలో మరో లగ్జరీ మల్టీప్లెక్స్ చేరింది. పంజాగుట్టలోని ఏరియా నాగార్జున సర్కిల్లో కాన్ప్లెక్ష్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్ లాంచింగ్ ఈవెంట్లో డీజే టిల్లు ఫేం సిద్ధు జొన్నలగడ్డ సందడి చేశాడు.
ఈ సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. థియేటర్‌ను విజిట్ చేశా. లోపల స్క్రీన్ క్వాలిటీ అద్బుతంగా ఉంది. నన్ను లాంచ్‌కు ఆహ్వానించినందుకు ఆనందంగా ఉంది. ఇక్కడకు వచ్చిన అభిమానులు, మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నాడు. విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి సంయుక్త భాగస్వామ్యంలో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు.
3 స్క్రీన్లలో మొత్తం 170 సీట్ల సామర్థ్యం ఉందని, స్క్రీన్ 1లో 62 సీట్లు, స్క్రీన్ 2లో 72 సీట్లు, స్క్రీన్3లో 37 సీట్లున్నాయని విజ్ఞాన్ యార్లగడ్డ చెప్పారు. ఈవెంట్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌తోపాటు నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ, నాగవంశీ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Jacqueline Fernandez | డోన్ట్ కేర్ అంటూ ఫ్యాషన్ వీక్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సందడి.. వీడియో
Imanvi | చారిత్రక ప్రదేశాల్లో ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ షికారు
Nagarjuna | నాగార్జున 100వ సినిమా డైరెక్టర్ ఇతడే.. అప్పుడే రిలీజ్ ప్లాన్ కూడా..?