Tribanadhari Barbarik | టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) కాంపౌండ్ నుంచి మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వస్తోన్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్ (Tribanadhari Barbarik). మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సత్యరాజ్ లీడ్ రోల్ రోల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రం నుంచి తాజాగా సత్యరాజ్ పాత్ర లుక్‌ను షేర్ చేశారు మేకర్స్. సత్యరాజ్ ఈ చిత్రంలో డ్యాక్టర్ శ్యామ్ కథు పాత్రలో నటిస్తున్నాడు. బార్బారిక్ ప్రపంచంలో సత్యరాజ్ పాత్ర కీలకంగా సాగనున్నట్టు పోస్టర్‌తో తెలియజేశాడు డైరెక్టర్. ఈ మూవీ టీజర్‌ను జనవరి ౩న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. రామాయణ, మహాభారతాల పాత్రలను తీసుకుని ఇప్పటికే చాలా సినిమాలు రాగా.. తాజాగా ఇదే జోనర్లో భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరిక్ కథ ఆధారంగా ఈ సినిమా వస్తుంది.
ఎవరు తాతా ఇతను..? అని చిన్నారి అడుగగా.. ప్రపంచం గుర్తించని గొప్ప యోధుడమ్మా.. భీష్ముడా తాతా..? హహ కాదమ్మా.. అంటూ సాగే డైలాగ్స్‌తో మాధవా.. వెయ్యేనుగుల బలశాలి భీముడికి మనవడిని. ఘటోత్కచుడుకు కుమారుడిని అంటూ బార్బరిక్ పాత్రను ఎలివేట్ చేసే ఇంట్రడక్షన్ వీడియో స్టన్నింగ్‌గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిధాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వశిష్ఠ ఎన్ సింహా, సంచి రాయ్, సత్యం రాజేశ్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేశ్, మొట్ట రాజేంద్ర, ఉదయ భాను ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సత్యరాజ్ పోస్టర్..
Introducing #Sathyaraj garu as Dr.Shyam Kathu, a character that stands tall in the world of #Barbarik.
Teaser dropping on Jan 3rd 🔥
A @DirectorMaruthi Team Product 💥@VijaypalreddyA @vanaracelluloid @iamraj20 @monivathsa #SathyaRaj @RKushendar @ImSimhaa @rai_sanchi… pic.twitter.com/JJ1uJWyKEC
— BA Raju’s Team (@baraju_SuperHit) January 2, 2025
త్రిబాణధారి బార్బరిక్ టైటిల్ గ్లింప్స్..
SSMB 29 | అడ్వెంచర్‌కు అంతా సిద్ధం.. నేడు రాజమౌళి, మహేష్ సినిమాకు కొబ్బరికాయ!