Movie Ticket Rates | ఈ మధ్య కాలంలో ఏ పెద్ద సినిమా విడుదలైనా కూడా.. అది ఎలా ఉంది అనే కంటే ముందు ప్రేక్షకులు మాట్లాడుకుంటున్న మాట టికెట్ రేట్ ఎంత పెంచారు అని..? ఎందుకంటే ఒక్కో సినిమాకు టికెట్ రేట్లు దారుణంగా అలా పెరిగిపోతున్నాయి మరి. ట్రిపుల్ ఆర్, కేజీయఫ్ 2 లాంటి సినిమాలకు టికెట్ల రేట్లు తెలంగాణలోని మల్టీప్లెక్సులలో ఏకంగా 413, 354 రూపాయలుగా ఉంది. అదే మామూలు థియేటర్స్ లోనూ 250, 210 రూపాయిలు ఉంది. వారం రోజుల తర్వాత ఆ టికెట్ రేట్లు కాస్త తగ్గుతాయి. ఈ విధంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఇటు తెలంగాణ.. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి.
ఈ విధానం కొన్ని సినిమాలకు వరంగా మారుతున్నప్పటికీ.. మరికొన్ని సినిమాలకు మాత్రం శాపమవుతుంది. ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 వంటి భారీ సినిమాలకు ఇంత రేటు పెట్టి చూడ్డానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అది కూడా ఒక్కసారి మాత్రమే. రేట్ల పెంపు కారణంగా రిపీటెడ్ ఆడియన్స్ మాత్రం లేరు. అంత రేట్లు పెట్టి ప్రేక్షకులు రెండో సారి థియేటర్లకు రావడం లేదు. మొన్న విడుదలైన ఆచార్య సినిమాకు టికెట్ల రేట్లు చాలా మైనస్ అయ్యిందనే చెప్పొచ్చు. ఈ సినిమాకు మల్టీప్లెక్స్‌లో టికెట్ ధర 354 రూపాయలు ఉంది. మొదటి రోజు నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజుకే థియేటర్స్ ఖాళీ అయిపోయాయి. వీటన్నింటినీ గమనించిన సర్కారు వారి పాట టీమ్ ఇప్పుడు టికెట్ల రేట్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు పరశురామ్ దర్శకుడు. దీనికి ఎలాంటి టికెట్ రేట్స్ హైక్స్ లేకుండా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పాత టికెట్ రేట్లు చాలు.. కొత్తగా పెంచాల్సిన అవసరం లేదని వాళ్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లతోనే ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. దీనివల్ల పాజిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే సినిమా బాగుంటే రిపీటెడ్ ఆడియన్స్ ఉండే అవకాశం ఉంది. మొత్తానికి సర్కారు వారి పాట టీమ్ టికెట్ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయంపై అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. మే 12న ఈ సినిమా విడుదల కానుంది.
“Parasuram | బార్సిలోనా షూటింగ్లో కీర్తిసురేశ్ కాస్ట్యూమ్స్ ఎత్తుకెళ్లారు: పరశురాం”
“Anantha Sriram | సిద్ శ్రీరామ్‌పై నెగెటివ్ కామెంట్స్..అనంత శ్రీరామ్ క్లారిటీ”
Parasuram | పరశురాం నెక్ట్స్ సినిమా ఈ హీరోతోనే ..!”
“Mahesh Babu | మహేశ్‌బాబు బ్రేక్..మరి త్రివిక్రమ్ సినిమా షురూ అయ్యేదెప్పుడు..?”