టాలీవుడ్ (Tollywood) టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం (Parasuram) ప్రస్తుతం స్టార్ హీరో మహేశ్ బాబుతో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మే 12న విడుదల కానుంది సర్కారు వారి పాట. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పరశురాం అండ్ టీం బిజీగా ఉంది. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత పరశురాం నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే చర్చ నడుస్తోంది. తాజాగా దీనిపై ఓ అప్ డేట్ ఇపుడు తెరపైకి వచ్చింది.
చాలా నెలల క్రితం నాగచైతన్య (Naga Chaitanya)తో పరశురాం ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే కోవిడ్ ఎఫెక్ట్‌తో ఆ సినిమా డిస్కషన్ కాస్తా అటకెక్కింది. మధ్యలో సర్కారు వారి పాట లైన్లోకి వచ్చింది. ఇపుడు మహేశ్ సినిమా పూర్తి కానుండటంతో పరశురాంకు ఫ్రీ టైం దొరికినట్టైంది. ఈ నేపథ్యంలో చైతూ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడట ఈ డైరెక్టర్. తాజా సమాచారం ప్రకారం సర్కారు వారి పాట చిత్రంలో వన్ ఆఫ్ ది ప్రొడక్షన్స్ బ్యానర్ అయిన 14 రీల్స్ బ్యానర్లోనే చైతూ సినిమా రాబోతుంది.
వచ్చే వారం నుంచి ప్రమోషన్స్ కార్యక్రమాలు స్పీడప్ చేయనుంది మహేశ్, పరశురాం టీం. మొత్తానికి 2 సంవత్సరాల విరామం తర్వాత ప్రాజెక్టు షురూ కాబోతుందన్న వార్త బయటకు రావడంతో..పరశురాం ఎలాంటి కథలో చైతూను చూపించబోతున్నాడోనని అక్కినేని అభిమానులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. నాగచైతన్య ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ ఛద్దాలో కీ రోల్ చేస్తున్నాడు. దీంతోపాటు రాశీఖన్నాతో కలిసి థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు.