సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. బి.వి.నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్ పతాకంపై ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. మే 18న విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘గల గల ఏరులా’ అంటూ సాగే మూడో గీతాన్ని గురువారం విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ స్వరపరచిన ఈ గీతాన్ని రెహమాన్ రచించారు. నకుల్ అభ్యంకర్, రమ్యభట్ ఆలపించారు. ఇటలీలోని అందమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించామని, ప్రేమికుల మదిలోని భావాలకు అద్దం పడుతుందని చిత్రబృందం పేర్కొంది. మాళవిక నాయర్, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంభాషణలు: లక్ష్మీ భూపాల, దర్శకత్వం: బీవీ నందినిరెడ్డి.