సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటిస్తున్న చిత్రం ‘కపుల్ఫ్రెండ్లీ’. అశ్విన్చంద్రశేఖర్ దర్శకుడు. తెలుగుత, తమిళ భాషల్లో యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తున్నది. సంగీతప్రధాన ప్రేమకథా చిత్రమిది. శనివారం హీరో సంతోష్శోభన్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు.
చెన్నై నేపథ్యంలో కథ సాగుతుందని, సంతోష్శోభన్ మధ్యతరగతి తెలుగు అబ్బాయిగా కనిపిస్తారని..త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ పురుషోత్తమన్, సంగీతం: ఆదిత్య రవీంద్రన్, రచన-దర్శకత్వం: అశ్విన్ చంద్రశేఖర్.