సంక్రాంతికి 1000 కోట్ల బిజినెస్.. ఏ హీరో సత్తా ఎంత..?

sankranti 2022 movies | సంక్రాంతి అంటేనే కొత్త సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ పండక్కి రావాలని హీరోలందరూ ప్లాన్ చేసుకుంటారు. అందుకే ప్రతిసారి సంక్రాంతి పండక్కి వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఈసారి ఆ స్థాయి ఇంకా పెరిగిపోయింది. వందల నుంచి వేల కోట్లకు సినిమా బిజినెస్ పెరిగింది. 2022 సంక్రాంతి పండుగకు వస్తున్న సినిమాల రేంజ్ చూస్తుంటే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. అందులో మూడు పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ ( RRR ), రాధే శ్యామ్ ( Radhe shyam ), భీమ్లా నాయక్ ( Bheemla nayak ) సినిమాలు ఈ సంక్రాంతికే బాక్సాఫీస్ వద్ద బరిలో దిగుతున్నాయి.

సంక్రాంతి పండుగకు అందరికంటే ముందుగా అంటే.. 2022 జనవరి 7న రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల కానుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా దాదాపు 600 కోట్ల బిజినెస్ చేస్తోంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఒకే రోజు విడుదల కానున్న ఈ సినిమాపై ఉన్న అంచనాలు చెప్పడానికి మాటలు సరిపోవు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఇందులో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంపై కూడా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. 100 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుంది భీమ్లా నాయక్ సినిమా. పేరుకు రీమేక్ సినిమా అయినా కూడా దీనిపై ఉన్న అంచనాలు చూస్తుంటే.. పాజిటివ్ టాక్ గాని వస్తే రికార్డులు తిరగరాయడం ఖాయం. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాసింది. అలాగే పాటలు కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండటం విశేషం.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. 150 కోట్ల బడ్జెట్‌తో రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఒకే రోజు విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక జనవరి 15న నాగార్జున హీరోగా వస్తున్న బంగార్రాజు విడుదల కానుంది. సోగ్గాడే చిన్నినాయన సినిమా కొనసాగింపు కథ ఇది. మనం తర్వాత నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నాలుగు సినిమాల బిజినెస్ దాదాపు 1200 కోట్లకు పైగా జరుగుతుంది. మరి ఇందులో ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bheemla nayak | RRR టీంను కంగారు పెడుతున్న పవన్ కళ్యాణ్..
ఓరి మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికార్రా.. నెటిజన్ కు RRR టీమ్ రిప్లై..
Alia bhatt | అమ్మో రెండేండ్లలో ఆలియాభట్ అంత సంపాదించిందా?
RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌లో భారీగా మార్పులు.. కోట్లల్లో హక్కులు..
Nithya Menen | పవన్‌కల్యాణ్‌తో పనిచేయడం చాలా ఈజీ : నిత్యమీనన్
Radheshyam Sequel | రాధేశ్యామ్ సీక్వెల్ రాబోతుందా..?
Radhe Shyam: రాధే శ్యామ్ వ్యూస్ తగ్గడంపై స్పందించిన యూట్యూబ్
Radhe Shyam: రాధేశ్యామ్ అప్డేట్స్ ఇవ్వడం లేదని అభిమాని సూసైడ్ నోట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

